ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ల్యాప్‌టాప్​ల కేసులో కోడెల తనయుడి కోసం గాలింపు... - మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం

30 ల్యాప్ టాప్​లు చోరీకి గురైన కేసులో ఓ వ్యక్తిని కోర్టుకు హజరుపరచగా...మెుదటి ముద్దాయి కోడెల శివప్రసాదరావు  తనయుడు శివరాం కోసం గాలిస్తున్నట్టు సత్తెనపల్లి సీఐ విజయ్ చంద్ర తెలిపారు.

ల్యాప్ టాప్​ల చోరీ కేసులో ఏ2 అరెస్ట్

By

Published : Sep 14, 2019, 8:21 AM IST

కేసు వివరాలు వెల్లడిస్తున్న సత్తెనపల్లి సీఐ విజయ్ చంద్ర

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 30 ల్యాప్ టాప్​ల చోరీ కేసులో... ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం కోసం గాలిస్తున్నట్లు సీఐ విజయ్ చంద్ర తెలిపారు. 2017 సంవత్సరంలో గ్రామీణ స్కిల్ డెవలప్​మెంట్​లో భాగంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసేందుకు... 30 కంప్యూటర్లు, సోలార్ యూపీఎస్​ని కేటాయించారు. కోడెల శివరాం తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ అవసరాల కోసం కార్యాలయానికి తరలించారని చెప్పారు. జిల్లా అధికారి బాజీ బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... రెండో ముద్దాయి అజయ్ చౌదరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా... మొదటి ముద్దాయి కోడెల శివరాం కోసం గాలిస్తున్నట్లుగా సీఐ తెలిపారు. 384, 380, 120బీ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లుగా ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details