గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌లో రెండో కోవిడ్-19 కేసు నమోదైంది. శుక్రవారం మూడో కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రజలెవరూ భయపడవద్దని చెప్పారు. తెనాలిలోని మూడు ప్రాంతాల్లో కరోనా రావడం వల్ల రెడ్‌జోన్ చేశామన్నారు. ఇంటింటికి వాలంటీర్ల ద్వారా నిత్యావసర వస్తువులు అందిస్తామని అన్నారు.
తెనాలిలో రెండో పాజిటివ్ కేసు నమోదు - గుంటూరు జిల్లా తెనాలి తాజా కొవిడ్-19 వార్తలు
గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌లో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఆ ప్రాంతాలను రెజ్జోన్ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని స్థానిక ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కోరారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని చెబుతున్న తెనాలి ఎమ్మెల్యే