ఇసుక కొరత... మరో కార్మికుడి ప్రాణం తీసింది
ఇసుక సమస్య తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కార్మికుల మరణాలు, బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా.. గుంటూరు జిల్లాలో ఓ కార్మికుడు తనకు ఉపాధి లేకుండా పోయిందన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని వివరిస్తూ తీసిన సెల్ఫీ వీడియోతో విషయం బయటపడింది.
sand
రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరత.. మరో కార్మికుడి ప్రాణం తీసింది. గుంటూరుకు చెందిన ప్లంబర్ పోలేపల్లి వెంకటేశ్.. ఇదే కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోతో విషయం బయటపడింది. ఉపాధి లేక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెంకటేశ్ వీడియోలో చెప్పాడు. ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Last Updated : Oct 28, 2019, 6:49 AM IST