ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం.. ఒకరు మృతి - road accident at guntur district latest news

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం మలుపు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Road accident on 16th number National Highway
16వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

By

Published : Apr 6, 2021, 2:10 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం మలుపు వద్ద ప్రమాదం జరిగింది. 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కడప జిల్లా మైదుకూరుకు చెందిన చలమచర్ల హరిప్రసాద్​రెడ్డి, ఉన్నూరు బాషా, సునీల్​రెడ్డి, గాలన ప్రభాకర్ లు విజయవాడకు వస్తుండగా ఘటన జరిగింది.

లారీని కొనుగోలు చేసేందుకు రూ.5 లక్షల నగదుతో కారులో ప్రయాణిస్తుండగా.. మలుపు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ట్రిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిని హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నగదును కూడా గ్రామీణ పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా గాలన ప్రభాకర్ (40) మృతి చెందాడు. హరిప్రసాదరెడ్డి, బాషా, సునీల్ రెడ్డిలకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...:రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details