గుంటూరు జిల్లా భట్టిప్రోలులో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో కోటేశ్వరరావు అనే కూలీ మృతిచెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా... వాహనం కింద పడి తీవ్రంగా గాయపడిన అతను చనిపోయాడు. దీంతో తమకు న్యాయం చేయాలని మృతుని కుటుంబ సభ్యులు ట్రాక్టర్ యజమాని ఇంటి వద్ద ఆందోళన చేశారు. విషయం తెలిసిన ట్రాక్టర్ యజమాని ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని... మృతుని బంధువులను పంపించేశారు. చంటి పిల్లాడితో ఒంటరిగా ఎలా బతికేదంటూ... మృతుని భార్య ఆవేదన చెందుతోంది.
డ్రైవర్ నిర్లక్ష్యం... రోడ్డునపడ్డ కుటుంబం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ కూలీ కుటుంబం రోడ్డున పడింది. తీవ్ర గాయాలై ఓ కూలీ చనిపోయాడు. న్యాయం చేయాలంటూ మృతుని కుటుంబ సభ్యులు యజమాని ఇంటికి వెళ్తే... అతనూ పరారయ్యాడు. పోషించేవాడు లేక పిల్లాడితో తన పరిస్థితేంటని బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
one man died with tractor Driver negligency at Battiprolu in Guntur District