ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొలకలూరులో డయేరియా కలకలం... ఒకరు మృతి.. పలువురు అస్వస్థత - ap news

అస్తవ్యస్తంగా మురుగు కాలువలు.. అవే కాలువలో నుంచి మంచినీటి పైపులైన్లు.. పాచిపట్టి పాడైపోయిన మంచినీటి ట్యాంక్​.. వాటి నుంచి సరఫరా అయిన నీళ్లు తాగి ఆ గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో 50 మంది వాంతులు, విరేచనాలతో వివిధ ఆస్పత్రుల్లో చేరారు. దీంతో అధికార యంత్రాంగమంతా హుటాహుటిన కదిలింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇదంతా గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరులోని పరిస్థితి. గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవటం, మురుగునీటి కాల్వలో తాగునీటి పైపులైన్లు ఉండటం వల్లే సమస్య తలెత్తినట్లు స్థానికులు వాపోయారు.

1
1

By

Published : Jul 1, 2022, 5:26 PM IST

Updated : Jul 1, 2022, 5:32 PM IST

Diarrhea effect in Kolakaluru: పారిశుద్ధ్య లోపం ఓ బాలిక నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మురుగు కాల్వలు శుభ్రం చేయక అస్తవ్యస్థంగా మారడంతోపాటు.... అవే కాలువల్లో నుంచి తాగునీటి పైపులు వేయడం ప్రజల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పైపులు పగిలి మురుగు నీరు తాగునీటిలో కలవడంతో గుంటూరు జిల్లా కొలకలూరులో అతిసారం ప్రబలింది. ఓ బాలిక మృతి చెందడంతోపాటు సుమారు 50మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవటం, మురుగునీటి కాల్వలో తాగునీటి పైపులైన్లు ఉండటం వల్లే సమస్య తలెత్తినట్లు స్థానికులు వాపోయారు.

కొలకలూరు ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనిధి అనే బాలిక వాంతులు, విరేచనాలతో గురువారం మృతిచెందింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. కొలకలూరు ఆరోగ్య కేంద్రంతోపాటు ...తెనాలి ప్రభుత్వాసుపత్రికి వరుసకట్టారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరు జీజీహెచ్​లో కొలకలూరు బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ 15 మంది చికిత్సపొందుతున్నారు. తెనాలి ఆసుపత్రిలో మందులు లేకపోవటంతో గుంటూరుకు తీసుకొచ్చారని బాధితులు వాపోయారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

కొలకలూరు గ్రామాన్ని కలెక్టర్ వేణుగోపాలరెడ్డితోపాటు.. వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామాన్ని సందర్శించారు. పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతోపాటు ట్యాంకర్ల ద్వారా రక్షిత తాగునీరు సరఫరా చేశారు. కొలకలూరు డయేరియా ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. 30 మంది వైద్య సిబ్బందిని పంపినట్లు తెలిపారు.

గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం డయేరియా అదుపులోకి వచ్చింది. మంచినీరు‌, ఆహారం నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపించాం. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు -విడదల రజిని, మంత్రి

పంచాయతీలకు నిధులు లేకపోవడం వల్లెల్లో పారిశుద్ధ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. తాగునీటి పైప్ లైన్లు మరమ్మత్తులు చేయటం లేదని.. ట్యాంకులు కూడా శుభ్రం చేయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 1, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details