గుంటూరు జిల్లా వినుకొండలోని ముళ్ళమూరు బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వినుకొండలోని కోటనల్సా బజారుకు చెందిన షేక్ నాగూర్ అలియాస్ సుప్రీమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ముళ్లమూరు బస్టాండ్ నుంచి నాగూర్ ద్విచక్రవాహనంపై వెళ్తుండగా... వెనుక నుంచి టాటా మ్యాజిక్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగూర్ని స్థానికులు వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థరించారు.
వినుకొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - mullamur road accident news
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి