గుంటూరు జిల్లా లామ్ గ్రామం ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు గాయం కావడంతో సింగ.రాయ్యప్ప(36) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న తాడికొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు అమరావతి మండలం మల్లాది గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. పంచనామా నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..వ్యక్తి మృతి - accident on lam village main road
గుంటూరు జిల్లా తాడికొండ మండలం లామ్ గ్రామం ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం చెట్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి