గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రులో విద్యుదాఘాతానికి గురై.. ఓ వ్యక్తి మృతి చెందాడు. నీటి కుళాయి మోటార్ స్విచ్ ఆన్ చేసే సమయంలో ఈ విషాదం జరిగింది.
కొత్త ఇంటిని నిర్మిద్దామని పాత ఇంటిని కూల్చాడు.. అద్దె ఇంట్లో కన్నుమూశాడు! - pasumarru electric shock news
కొత్త ఇంటిని నిర్మిద్దామని కలలు కన్నాడు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. పాత ఇంటిని కూల్చేసి.. మరో ఇంట్లో అద్దెకు దిగాడు. నూతనంగా నిర్మించే ఇంటి పనులను దగ్గరుండి చూసుకుందామనుకున్నాడు. తానొకటి అనుకుంటే విధి మరోటి తలిచింది. సొంత గూటికి చేరకముందే అతణ్ని విద్యుదాఘాతం రూపంలో బలితీసుకుంది. ఆ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచింది.
men died
గ్రామానికి చెందిన తన్నీరు కొండలరావు(55) తాపీ మేస్త్రి. పది రోజుల క్రితం కొత్త ఇల్లు కట్టుకునేందుకు పాత ఇల్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో సమీపంలోని మరొక ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రోజూలాగే మోటర్ స్విచ్ వేయబోయాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అయ్యా... మాబోటి ముసలోళ్ల కోసం కూడా కాస్త పని చేయండయ్యా..!