గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం డోకిప్పర్రు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పాదచారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వయస్సు 35 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆనందరావు తెలిపారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారి మృతి - dokiparru road accident recent news
గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారి మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా డోకిప్పర్రు వద్ద జరిగింగి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని పాదచారి మృతి