ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒక్క రోజులోనే కోటికి పైగా నగదు పట్టివేత - guntur

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి నెలకొన్న సందర్భంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అక్రమ నగదుపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు ఒక్కరోజే గుంటూరు జిల్లాలో కోటి రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

By

Published : Mar 12, 2019, 8:53 PM IST

24 గంటల్లో కోటీ
ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో పెద్దఎత్తున నగదు పట్టుబడుతోంది. ఇవాళ గుంటూరులోని కొత్తపేటలో పోలీసులు వాహనాలు తనిఖీల్లో.. ద్విచక్ర వాహనంపై సుబ్బారెడ్డి అనే వ్యక్తి నగదు తీసుకెళ్తుండగా బ్యాగ్ తో పట్టుబడ్డారు. అందులో 22లక్షల 94వేల రూపాయలు ఉన్నట్లు తేలింది. నగల వర్తకులు, సెల్ ఫోన్ దుకాణాదారుల నుంచి తమకు రావాల్సిన నగదు వసూలు చేసి బ్యాంకులో వేసేందుకు తీసుకెళ్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు చూపించనందున పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తును ఆదాయపు పన్నుశాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. నగదు సంక్రమమా లేక అక్రమ లావాదేవీలున్నాయా అనే విషయం వారే తేలుస్తారని కొత్తపేట సీఐ మధుసూధనరావు స్పష్టం చేశారు.సుబ్బారెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న సొమ్ముతో కలిపి గుంటూరు జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. ఉదయం మంగళగిరి వద్ద 82లక్షలు... మధ్యాహ్నం పెదకాకాని వద్ద 6లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మంగళగిరిలో పట్టుబడిన నగదు... ఓ భూమి విక్రయానికి సంబంధించిందని తేలినందున తిరిగి అప్పగించారు. ఇక మిగిలిన చోట్ల పట్టుబడిన నగదుతో నేతలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలా లేకపోతే ఐటీ అధికారులకు అప్పగిస్తామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details