పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ - corona latest updates guntur district
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా అనుమానంతో కొవిడ్ పరీక్షలు చేయించుకోగా బుధవారం కరోనా ఉందని నిర్ధారణ అయింది.
![పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ one corona positive case in perecherla guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7944389-1082-7944389-1594218643262.jpg)
పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. పేరేచర్లలో కరోనా కేసుల సంఖ్య 5కు చేరింది. మేడికొండూరు మండలంలో మెుత్తం 12 కేసులు నమోదయ్యాయి. తాడికొండ నియోజకవర్గంలోని ఫిరంగిపురం మండలంలో ఇప్పటి వరకు 5 కేసులు రాగా ప్రైమరీ కాంటాక్టులను గుర్తించి వారికి కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధులు నిర్వహించిన ఫిరంగిపురానికి చెందిన ఐదుగురు పోలీసులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.