ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Munugode: మునుగోడు ఉపఎన్నిక వేళ.. భారీగా మద్యం, డబ్బులు పట్టివేత - మునుగోడు ఎన్నికలపై ఆంధ్రప్రజల అభిప్రాయం

Munugode by election: మునుగోడు ఉపఎన్నిక వేళ మరోసారి భారీగా మద్యం, డబ్బులు పట్టుబడ్డాయి. తెరాస నేత వెంకట్‌రెడ్డి ఇంట్లో సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల తనిఖీలు నిర్వహించగా... మద్యం, గోడగడియరాలు, కూల్‌డ్రింక్స్, పార్టీ గొడుగులు స్వాధీనం చేసుకున్నారు. తూప్రాన్‌ చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ.93.99 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Munugode bypoll
మునుగోడులో భారీగా మద్యం డబ్బులు

By

Published : Nov 1, 2022, 10:56 PM IST

Munugode bypoll: నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పసునూరులో భారీగా మద్యం పట్టుబడింది. తెరాస నేత వెంకట్‌రెడ్డి ఇంట్లో సీఆర్‌పీఎఫ్‌ పోలీసుల తనిఖీలు నిర్వహించారు. మద్యం, గోడగడియరాలు, కూల్‌డ్రింక్స్, పార్టీ గొడుగులు స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ మండలం తూప్రాన్‌ చెక్‌పోస్టు వద్ద నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న రూ.93.99 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. నగదు ఎవరిదనే విషయంపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details