ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయం చేయండి'.. ఎలుకల మందుతో 'స్పందనకు' వృద్ధురాలు - ఏపీ తాజా వార్తలు

OLD WOMAN PROTEST WITH RAT DRUG: తనకున్న ఎకరం ఆరు సెంట్ల భూమిని వేరేవారి పేరుతో రిజిస్టర్‌ చేశారంటూ.. ఓ వృద్ధురాలు స్పందన కార్యక్రమానికి ఎలుకల మందుతో రావటం కలకలం రేపింది. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

OLD WOMAN SUICIDE ATTEMPT
OLD WOMAN SUICIDE ATTEMPT

By

Published : Mar 20, 2023, 5:43 PM IST

OLD WOMAN PROTEST WITH RAT DRUG: ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి వైసీపీ ప్రభుత్వం స్పందన అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కలెక్టర్​ కార్యాలయాల్లో, ఎమ్మార్వో ఆఫీసుల్లో, ఆర్డీవో ఆఫీసులకు వచ్చి తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తారు. అయితే తాజాగా స్పందన కార్యక్రమానికి ఓ వృద్ధురాలు ఎలుకల మందుతో రావడం కలకలం రేపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

గుంటూరు జిల్లా తాడికొండ మండలం పెదపరిమికి చెందిన కావూరు అక్కమ్మకు ఆమె తల్లి నుంచి కొంత భూమి లభించింది. దానిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఒక ఎకరం ఆరు సెంట్ల భూమిని తాడికొండ మండల అధికారులు తనకు కాకుండా వేరే వారి పేరు మీద రాశారని వాపోయింది. ఈ అంశంపై కోర్టు తీర్పు చెప్పినా అధికారులు మాత్రం తనకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల గుంటూరు రెవెన్యూ డివిజన్‌ అధికారిని కలిసి విన్నవించగా.. ఆయన నేరుగా తాడికొండ మండల అధికారులు ఫోన్‌ చేసి మాట్లాడితే.. వారు తాను చనిపోయిందని చెప్పారంటూ అక్కమ్మ వాపోయింది.

ఆర్డీవో సిబ్బందిని గట్టిగా మందలించి తన పొలం తనకు ఇవ్వాలని సూచించినా సమస్య పరిష్కారం కాలేదంటూ కన్నీరు పెట్టుకుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టర్​ ఆఫీసుకు ఎలుకల మందుతో వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. తనకు న్యాయం చేయాలని అక్కమ్మ కోరుతోంది.

కలెక్టర్​ కార్యాలయం వద్ద ఎలుకల మందుతో వృద్ధురాలు ఆందోళన..

"మాది పెదపరిమి.. నేను చేబ్రోలులో ఉంటా. మొన్న ఒకసారి మా ఊరికి వెళ్తే.. నా పొలాన్ని వేరే వారి పేరు మీదకు ఎక్కించారని కొందరు చెప్పారు. అప్పుడు నేను కోర్టును ఆశ్రయించా. మంగళగిరి కోర్టులో దానిని కొట్టివేశారు. డబ్బులు కట్టి హైకోర్టు నుంచి బుక్​ తెచ్చుకున్నారు. నిన్న హైకోర్టు లాయర్​ని కలిశా. ఆయనేమో ఆర్డీవో ఆఫీసుకు వెళ్లు.. నీకు అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. ఇక్కడకి వచ్చి అడిగితే నేను చనిపోయినట్లు ఉందని చెబుతున్నారు. ఆర్డీవో సలహా మేరకు తాడికొండ ఎమ్మార్వో ఆఫీసుకు పోతే.. హైకోర్టు నుంచి కాగితం తెచ్చుకుంటే పొలం నీ పేరు మీదకు ఎక్కిస్తాము అన్నారు" -కావూరు అక్కమ్మ, బాధితురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details