గుంటూరు జిల్లా మాచర్లలో వ్యాపార చేసుకునే ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడుతుంది. కుటుంబంలో పెద్ద కుమారుడు మూడు నెలల క్రితం చనిపోయాడు. మృతుడు తమ్ముడుకి నెల రోజుల క్రితం కొవిడ్ సోకడం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందాడు. ఇటీవల అతని ఆరోగ్యం కాస్త కుదుట పడటం వల్ల పర్వాలేదని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇవాళ అతనూ అకస్మాత్తుగా మృతి చెందడం ఆ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
కుమారులు బంగారు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న ఆ తల్లి.. నెలల వ్యవధిలో తన ఇద్దరు కుమారులు చనిపోవడం వల్ల తల్లడిల్లిపోయింది. మానసిక సంఘర్షణకు గురైంది. కొడుకు చనిపోయిన దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయింది.