గుంటూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి పాత గుంటూరు ముగ్దుంనగర్లో ఓ రేకుల షెడ్డు కూలి అందులో ఉన్న వృద్ధురాలు మేహరున్ని(75) మృతి చెందింది. స్థానికులు అప్రమత్తమై శిథిలాలు తొలగించి చూడగా ఆమె మృతి చెందింది. ఆమెతో పాటు నివాసం ఉంటున్న మరో మహిళకు గాయాలు కాగా సమీప ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల కారణాలు పైన ఆరా తీస్తున్నారు.
రేకుల షెడ్ కూలి వృద్ధురాలు మృతి - Old woman dies after shedding petals
వర్షానికి తడిచిన ఓ రేగుల షెడ్ కూలి అందులో ఉన్న వృద్దురాలు మృతి చెందింది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది.
![రేకుల షెడ్ కూలి వృద్ధురాలు మృతి guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7582884-732-7582884-1591942877389.jpg)
రేగుల షెడ్ కూలి వృద్ధురాలు మృతి