గుంటూరు వద్ద సాగర్ కుడి కాలువలో దూకిన వృద్ధురాలి మృతదేహం.. ముత్యాలంపాడు బుగ్గవాగు జలాశయంలో ఈరోజు లభించింది. మాచర్లకు చెందిన చిన్ని లక్ష్మీ కోటమ్మ.. మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నెలల వ్యవధిలోనే ఇద్దరు కన్న కొడుకులు చనిపోవడంతో తట్టుకోలేక పోయిందని వాపోయారు.
లక్ష్మీ కోటమ్మకు నలుగురు కుమారులుండగా.. వారిలో ఒకరు మూడు నెలల క్రితం చనిపోయారని కుంటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాధను దిగమింగి కాలం గడుపుతోందన్నారు. అంతలోనే ఈనెల 26వ తేదీన అనారోగ్యంతో మరో కుమారుడు మరణించాడని పేర్కొన్నారు. ఈ రెండు సంఘటనలతో మానసిక ఒత్తిడికి గురై.. ఆత్మహత్యకు చేసుకుందన్నారు. పంచనామా నిమిత్తం మృత దేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.