గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో ఓ ఉపాధ్యాయుడికి పూర్వవిద్యార్థులు విగ్రహం ఏర్పాటు చేశారు. రామినేని వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు గార్లపాడు గ్రామంలో 30ఏళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆయన వద్ద చదువుకున్న విద్యార్థులు అనేక రంగాల్లో స్థిరపడ్డారు. దాదాపు 3 వేల మందికి ఆయన విద్యాబుద్ధులు నేర్పించారు. ఇటీవల ఆయన, ప్రకాశం జిల్లా రామనూతలలో మరణించారు.
పూర్వవిద్యార్థుల వందనం..గురువు జ్ఞాపకార్థం విగ్రహం - గుంటూరు వార్తలు
ఆయన ఓ సాధారణ ఉపాధ్యాయుడు. ఒక గ్రామంలో ముప్పై ఏళ్లుగా ఎంతో మందికి చదువు నేర్పారు. ఇటీవల మరణించారు. ఆయన వద్ద చదువుకున్న వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. తమకు ఉన్నతస్థితిని కల్పించిన గురువు జ్ఞాపకాలను, గుర్తులను ఎప్పటికీ మరిచిపోకూడదనుకున్నారు. అందరి సాయంతో ఆయనకు విగ్రహం నిర్మించారు. నిర్మలమైన గురుభక్తిని చాటుకున్నారు. గురువుపై ఉన్న అభిమానానికి ప్రతీకగా నిలిచిన ఈ ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో జరిగింది.
![పూర్వవిద్యార్థుల వందనం..గురువు జ్ఞాపకార్థం విగ్రహం old students Set up a teacher statue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10525109-199-10525109-1612616058995.jpg)
గురువు జ్ఞాపకార్థం విగ్రహం
గురువు జ్ఞాపకార్థం విగ్రహం
దాంతో పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు కలసి ఆ గురువును గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తమకెంతో ఇష్టమైన ఉపాధ్యాయుడి విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. గురువు రామినేని వెంకటేశ్వర్లు జ్ఞాపకానికి గుర్తుగా పూర్వ విద్యార్థులు చేసిన పనికి ప్రశంసలు అందుతున్నాయి.