వృద్ధాప్యంలో బాగోగులు చూసుకుంటూ అండగా ఉంటారని ఆస్తిని కూతురు బిడ్డకు రాసిచ్చారు. ఆస్తి తీసుకుని తమని పట్టించుకోవడం లేదని వృద్ధ దంపతులు వాపోతున్నారు. ఆస్తి తీసుకుని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వృద్ధ దంపతులు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేడికొండూరు మండలం పేరేచర్ల చెందిన మదమంచి శివయ్య, కోటేశ్వరమ్మ దంపతులు వృద్ధులయ్యారు. ముసలితనంలో బాగోగులు చూసుకుంటారన్న ఆశతో వారి పేరుమీద ఉన్న ఐదు సెంట్ల స్థలం, ఒక ఇల్లు వారి తదనంతరం కూతురు బిడ్డ కళ్యాణ్ చక్రవర్తి కుటుంబానికి రాసి ఇచ్చారు. కళ్యాణ్ చక్రవర్తి లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. పది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళాడు. అప్పటినుంచి చక్రవర్తి భార్య అనూష మానసికంగా ఇబ్బంది పెడుతోందని దంపతులు వాపోతున్నారు.