గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామానికి చెందిన దూళిపాళ్ల చంద్రయ్య(70) గురువారం ఉదయం పొలంలో కంప చెట్లు తొలగించేందుకు వెళ్ళాడు. తిరిగి ఇంటికి రాకపోవడ కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో విచారించారు. అనంతరం పొలానికి వెళ్లి పరిశీలించగా జమ్మి చెట్టు కింద మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. చెవి నుంచి రక్తం కారినట్లుగా ఉండటంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మరణానంతర పరీక్షలకు తరలించారు.
వృద్ధుడు అనుమానాస్పద మృతి.. ఆస్తి తగాదాలే కారణమా..? - గుంటూరు జిల్లాలో వృద్ధుడు అనుమానస్పద మృతి వార్తలు
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెట్లు కొట్టేందుకు పొలంలోకి వెళ్లిన చంద్రయ్య మృతి చెందగా చెవి వెంట రక్తం వచ్చినట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్తి కోసం బంధువులు ఏదైనా చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Breaking News