ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPE ATTEMPT: మైనర్​పై వృద్ధుడు అత్యాచారయత్నం.. ఆపై ఏం చేశాడంటే - గుంటూరు జిల్లా

మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా అమర్తలూరు మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై తెనాలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం పోలీసుల దాకా వెళ్లడంతో.. వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

RAPE ATTEMPT
RAPE ATTEMPT

By

Published : Sep 8, 2021, 9:08 PM IST

గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండల పరిధిలో మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. దీనిపై సదరు బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జరిగిన విషయాన్ని బాలిక తల్లికి సోమవారం రాత్రి తెలపడంతో.. మంగళవారం ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దిశ డీఎస్పీ రవిచంద్ర, తెనాలి డీఎస్పీ స్రవంతి రాయ్ లు బుధవారం కేసు విచారణ చేపట్టారు. బాలిక ఇంటికి వచ్చి..తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు. అత్యాచారయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడు ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేయడంతో.. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details