73 Years Old Student Learning Drawing in Duntur : గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన రామమోహనరావు పంచాయతీరాజ్ విభాగంలో ఏఈగా పనిచేశారు. 2006వ సంవత్సరంలో పదవి విరమణ చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పిల్లలకు వివాహాలు అయిపోయాయి. మనవళ్లు, మనవరాళ్లతో విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నారు. రామ్మోహనరావు చేతిరాత అందంగా ఉంటుంది. అది కవితైనా, వ్యాసమైనా.. నిముషాల్లో చూడముచ్చటగా రాయగలరు. విద్యార్థి దశ నుంచి చిత్రలేఖనం అంటే ఎంతో ఆసక్తి ఉన్నా... అప్పట్లో శిక్షణ పొందలేక పోయారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తమ ఇంటి సమీపంలోనే చిత్రలేఖన శిక్షణ శిబిరం మొదలవటంతో ఆయన నేర్చుకోవటం ప్రారంభించారు.
చిన్ననాటి కల.. ఆయన లక్ష్యం :తెనాలి మండలం పెదరావూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో చిత్రలేఖన ఉపాధ్యాయుడైన పణిదెపు వెంకటకృష్ణ వద్ద ఇతర పిల్లలతో కలిసి సాధన మొదలు పెట్టారు. ఇప్పుడు పిల్లలతో కలిసి తానూ డ్రాయింగ్ లోయర్ పరీక్షలకు హాజరయ్యారు. పెద్దాయన ఎంతో ఆసక్తితో సందేహాలకు ఎప్పటికప్పుడు సమాధానాలు తెలుసుకుంటూ రోజూ సాధన చేస్తున్నారు. చిన్నప్పటి కల సాకారం అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని, సాధన కొనసాగించి హయ్యర్ పరీక్షలు కూడా రాస్తానని రామమోహనరావు తెలిపారు. తన తల్లిదండ్రుల చిత్రాన్ని తాను స్వయంగా గీయటం తన ముందు ఉన్న ప్రస్తుత లక్ష్యమని దానిని సాధిస్తానని వివరించారు.
"మాస్టారు చిన్న పిల్లలకు డ్రాయింగ్ నేర్పిస్తుంటారు. నేను కూడా 7 నెలల నుంచి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాను. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం నేర్చుకోవడానికి వెళుతుంటాను. నాకంటే చిన్న పిల్లలు డ్రాయింగ్ బాగు గిస్తారు. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నేను వాళ్ల లాగా గీయలేకపోతున్నాన్నాని బాధగా కూడా ఉంటుంది. నేను డ్రాయింగ్ చేసేటప్పుడు తప్పులు పోతాఉంటాయి. వాటిని చేరిపేసి బొమ్మ మంచిగా వంచేంత వరకు వేస్తూ ఉంటాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల బొమ్మ గీయాలని నా కోరిక. నాకు చాలా ఆనందంగా ఉంది."-మోపర్తి రామ్మోహన్ రావు, విద్యార్థి