వృద్ధ దంపతుల సుదీర్ఘ వైవాహిక అనుబంధాన్ని కరోనా మహమ్మారి ముగించింది. చివరి గడియల్లో ఒకే గదిలో చికిత్స పొందుతూ గంటల వ్యవధిలోనే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. గుంటూరు నగరానికి చెందిన విశ్రాంత ఉద్యోగి (72), ఆయన భార్య (66) నాదెండ్ల మండలం సాతులూరులోని కుమార్తె వద్దకు కొంతకాలం క్రితం వచ్చారు.
ఇటీవల అనారోగ్యంతో కుమార్తె మృతి చెందింది. వారి బాగోగులు అల్లుడు చూసుకుంటున్నారు. ఇటీవల కరోనా సోకడంతో గుంటూరులోని ఆసుపత్రిలో ఒకే గదిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో పాటు గుండెపోటుకు గురై వృద్ధుడు శుక్రవారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. అది చూసి ఆయన భార్య మనోవేదనకు గురై.. అదే రాత్రి తుదిశ్వాస విడిచింది.