ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చరిత్రకు సాక్ష్యాలు... ఆయన వద్ద ఉన్న నాణేలు

ప్రాచీన వస్తువులు.. నాణేలు.. నాటి పాలకుల పరిపాలనకు సాక్ష్యాలు. పురాతన సంస్కృతిని, ఆర్థిక, ఆధ్యాత్మిక ,మత ఆచార వ్యవహారాలను భావితరాలకు చూపే దర్పణాలు. ఆ చరిత్ర గుర్తులను పదిలపరుస్తున్నారు ఓ ఉపాధ్యాయుడు. 25 ఏళ్లుగా పురాతన పనిముట్లు, నాణేలను సేకరిస్తున్నారు.

By

Published : May 10, 2019, 11:02 AM IST

గౌస్ బేగ్ సేకరించిన పురాతన నాణేలు

చరిత్ర సాక్ష్యాలు

గుంటూరు జిల్లా నగరం మండలం అల్లపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న గౌస్ బేగ్​కు పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. ఆ మక్కువే ఆయనకు అలవాటుగా మారింది. చరిత్ర గుర్తులను పదిలపరచి అందరికీ తెలియజేయాలని... 25 ఏళ్లుగా పురాతన నాణేలను, పాతరాతి పనిముట్లను సేకరిస్తున్నారు.

ఇప్పటికే ఆయన వద్ద అల్లావుద్దీన్ ఖిల్జీ, గజిని మహమ్మద్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నాటి నాణేలు.. చోళులు, ఇక్ష్వాకులు, బ్రిటిష్ కాలంలో వాడిన నాణేలు ఉన్నాయి. ఇవే కాకుండా రాతియుగపు పనిముట్లు 32 దేశాల 41 కరెన్సీ నోట్లు వివిధ దేశాల 121 నాణేలు వందేళ్ల క్రితం స్టాంపులు సేకరించారు. పురాతన వస్తువులను సేకరించి.. భద్రపరచడమే కాక విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు పెట్టి వీటిని చూపిస్తూ చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details