కరోనా వైరస్ ప్రబలకుండా గుంటూరు జిల్లాలోని అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు మంగళగిరి హోటల్స్‌లో అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఆహార నాణ్యతపై తనిఖీలు చేశారు. ఆటోనగర్‌లో ఉన్న ఓ హోటల్లో నిల్వ ఉన్న చికెన్, మాంసం, చేపలను గుర్తించారు. చికెన్ తక్కువ ధరకు లభిస్తున్నా ఇంత భారీ మొత్తంలో ఎందుకు నిల్వ చేశారని హోటల్ యాజమాన్యంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని మిగిలిన హోటల్స్‌లోనూ దాడులు చేసి నిల్వ ఉన్న మాంసాన్ని కాలువలో పడేశారు.
చికెన్ రేటు తగ్గినా హోటళ్లలో నిల్వ మాంసమేలా! - గుంటూరు జిల్లాలో హోటళ్లపై అధికారుల తనిఖీలు
కరోనా పుణ్యమా అని చికెన్ తక్కువ ధరకే వస్తోంది. అయినా కొన్ని హోటళ్లు మాత్రం నిల్వ ఉంచిన మాంసాన్నే వండి వడ్డిస్తున్నాయి. కనీస ఆహార నియమాలు పాటించకుండా మనుషుల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నాయి.
Officials rides on hotels for maintain food quality at mangalagiri in guntur