గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పలు నిత్యావసర సరుకుల దుకాణాల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. కరోనా విపత్కర పరిస్థితిని కొందరు దుకాణదారులు ఆసరాగా తీసుకుని నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో అధిక ధరలకు విక్రయిస్తున్న పలువురు వ్యాపారులకు జరిమానా విధించారు.
తూనికలు కొలతల శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు..
కొవిడ్ పరిస్థితులను ఆసరాగా తీసుకొని నిత్యవసర సరుకులను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులకు తూనికలు కొలతల శాఖ అధికారులు జరిమానా విధించారు. వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
తూనికలు కొలతల శాఖ అధికారులు
తూనికలు, కొలతల శాఖాధికారి సునీల్ రాజా ఆధ్వర్యంలో ఈ తనిఖీ నిర్వహించారు. అధికారులు దుకాణాలపై దాడులు చేస్తున్నారనే సమాచారం రావడంతో కొందరు తమ షాపులను మూసివేశారు. పట్టణంలోని కిరాణా దుకాణాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల పట్టిక ఏర్పాటు చేస్తే ఇలాంటి దోపిడీలకు అడ్డుకట్ట వేయవచ్చని పట్టణ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ..ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖ