ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అధికారులు

ఉన్నత చదువుల కోసం నగరాలకు వెళ్లే పల్నాడు వాసుల కష్టాలు ఇక తొలగనున్నాయి. నాణ్యమైన విద్యను అందించడమే ధ్యేయంగా నడుస్తున్న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో ప్రజలకు విద్య మరింత చేరువ కానుంది. ఈ మేరకు మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు.

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అధికారులు
కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అధికారులు

By

Published : Nov 13, 2020, 5:14 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రీజినల్ డిప్యూటీ కమిషనర్ శాసింద్రన్​తో పాటుగా తదితరులు స్థలాన్ని పరిశీలించారు. తహసీల్దార్ వెంకయ్య, ఎంఈవో నాగయ్య వారికి పలు విషయాలు వివరించారు. అనంతరం మాచర్లలోని జడ్పీ బాలుర హైస్కూల్​లో తాత్కాలికంగా తరగతుల ఏర్పాటుకు అనుకూలమైన గదులను పరిశీలించారు. రెవెన్యూ వారు స్థలాన్ని అప్పగించిన అనంతరం దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని శాసింద్రన్​ తెలిపారు. పరిశీలించిన అంశాలను నివేదిక రూపంలో దిల్లీలోని ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.

మాచర్లలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు స్థలం పరిశీలించిన అధికారులు

ABOUT THE AUTHOR

...view details