ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కామధేనుపూజలో పాల్గొననున్న సీఎం.. ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

నరసరావుపేట, కోటప్పకొండ ప్రాంతాల్లో తితిదే జేఈవో ధర్మారెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీలు పర్యటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 15న నరసరావుపేటలో చేపట్టబోయే కామధేనుపూజ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లును పరిశీలించారు.

By

Published : Jan 12, 2021, 6:49 PM IST

Officials examined the arrangements of the Kamadhenu Puja
కామధేనుపూజ ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు


హిందూ ధర్మప్రచార పరిషత్ ద్వారా జరగనున్న గోపూజ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి హాజరయ్యే అవకాశం ఉన్నందున స్థల పరిశీలన, భద్రతా ఏర్పాట్లపై గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలసి ఆయా ప్రాంతాలను సందర్శించారు. నరసరావుపేటలోని కోడెల స్టేడియాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ..అధికారులతో చర్చించారు. అనంతరం కోటప్పకొండ దిగువ ప్రాంతం వద్ద స్థలాన్ని పరిశీలించారు. గోపూజా కార్యక్రమానికి అవసరమైన ప్రదేశం, తదితర అంశాలపై అధికారులతో తితిదే జేఈవో ధర్మారెడ్డి చర్చించారు.

కామధేనుపూజ ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

అనంతరం టీటీడీ జేఈవో ధర్మారెడ్డి, రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, తితిదే అధికారులతోపాటుగా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...:'కిడ్నాప్' కలకలం: బాధితుడి వాదన ఒకటి.. పోలీసుల వాదన మరోటి!

ABOUT THE AUTHOR

...view details