ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నొస్తున్నాడంటే.. అన్నీ తొలగించాల్సిందే.. మూసేయాల్సిందే

Trees Cutting Due to Cm Tour : ముఖ్యమంత్రి పర్యటన అంటే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పేరుతో అధికారులు, పోలీసులు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. దీంతో సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎంతో ఉపయోగకరమైన చెట్లను అడ్డంగా నరికేస్తున్నారు. సభ జరిగే పరిసర ప్రాంతాల్లో షాపులన్నీ మూయిస్తూ... చిన్న చిన్న వ్యాపారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

Trees Cutting Due to Cm Tour
సీఎం పర్యటన చెట్ల నరికివేత

By

Published : Feb 27, 2023, 5:54 PM IST

Updated : Feb 27, 2023, 6:12 PM IST

CM Jagan Tour In Guntur : ముఖ్యమంత్రి పర్యటన అనగానే రోడ్ల వెంట ఉన్న చెట్లను నరకటం పరిపాటి అయ్యింది. ఏదో సాకు చూపుతూ అధికారులు చెట్లను తొలగించటానికి ఆదేశాలు ఇస్తున్నారు. భద్రత పేరుతో, రోడ్డుకు అడ్డంగా ఉన్నాయని ఇలా చెప్తూ ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న వృక్షాలను నరికివేస్తున్నారు. ఇది తెలిసిన ప్రకృతి ప్రేమికులు, ప్రజలు.. అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉందని అధికారులు చెట్లను తొలగించారు. అంతేకాకుండా రోడ్డుకు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన పేరుతో మరోసారి చెట్లను తొలగించిన అధికారులు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా అధికారులు పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్, మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదేకాకుండా.. ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందుకోసం తెనాలిలో పలు కార్యక్రమాలను నిర్వహించనుండగా.. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి పాల్గొననున్నారు. రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని.. తెనాలిలోని మార్కెట్​ యార్డులో మంగళవారం (ఫిబ్రవరి 28) నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి సభ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పూర్తి ఏర్పాట్లు ముగిసినట్లు స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం చేసిన ఏర్పాట్లలో అలంకారం కోసం మొక్కజొన్న కంకులకు పార్టీ రంగులను వేశారు.

సీఎం పర్యటన వివరాలు : ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ముఖ్యమంత్రి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 10 గంటల 15 నిమిషాలకు తెనాలి చేరుకోనున్నారు. 10 గంటల 35 నిమిషాలకు స్ధానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలోని బహిరంగ సభా వేదికకు చేరుకుని సభలో పాల్గొంటారు. బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తారు. ఆ తర్వాత 12 గంటల 45 నిమిషాలకు సభ వేదిక నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 1. 10 నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా.. అధికారులు, పోలీసులు భద్రత కారణాల పేరుతో చెట్లను తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగి మార్కెట్ యార్డుకు వెళ్లే దారిలో.. రోడ్డు పక్కన ఉన్న వృక్షాలను అధికారులు తొలగిస్తున్నారు. సంవత్సరాల తరబడి పెరిగిన పచ్చని చెట్లను నరకివేయటంపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదేకాకుండా ముఖ్యమంత్రి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. వీటివల్ల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు మార్కెట్ యార్డులోకి అదనపు ప్రవేశాల ఏర్పాటు కోసం.. రక్షణ గోడను సైతం కూల్చివేశారు. మార్కెట్ సెంటర్​లోని దుకాణాలను మంగళవారం మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు గతంలో చెట్ల నరికివేత : గత సంవత్సరం నవంబరు నెలలో గుంటూరులోని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలోని వందలాది చెట్లను తొలగించారు. కిలోమీటర్ల మేర తొలగించగా.. ఏళ్ల క్రితం నుంచి పెరిగిన చెట్లు ఒక్కసారి సగానికి నరికివేయటంతో మోడుపోయి దర్శనమిచ్చాయి. పచ్చదనంతో నిండి కళకళాడిన రోడ్డు వృక్షాల తొలగింపుతో అందవిహీనంగా మారింది. అంతేకాకుండా గత నెల ముఖ్యమంత్రి విశాఖ పర్యటన సందర్భంగా ఇక్కడ కూడా చెట్లను తొలగించారు. చినముషిడి జంక్షన్​ సమీపంలో చెట్లను తొలగించారు. ఇక్కడ చెట్లను తొలగించటంతో అప్పటివరకు అందంగా ఉన్న రోడ్లు.. పచ్చదనం లేక విహీనంగా తయారైంది.

ఇవీ చదవండి :

Last Updated : Feb 27, 2023, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details