ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 14న మిర్చి యార్డును తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు - గుంటూరు జిల్లా ముఖ్య వార్తలు

గుంటూరు మిర్చి యార్డును ఈ నెల 14 వ తేదీన తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యార్డులో పేరుకుపోయిన చెత్తచెదారం తొలగిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి ధరలు నిలకడగానే ఉన్నాయని కార్యదర్శి వెంకటేశ్వర్​రెడ్డి తెలిపారు.

ఈ నెల 14 న మిర్చి యార్డును తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు
ఈ నెల 14 న మిర్చి యార్డును తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు

By

Published : Jun 8, 2021, 8:14 PM IST

గుంటూరు మిర్చియార్డును ఈనెల 14వ తేదీన తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా ఉద్ధృతితో పాటు వేసవి సెలవుల దృష్ట్యా మిర్చియార్డును మే 3వ తేదీన మూసివేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గోదాముల వద్ద మిర్చి విక్రయించుకునేందుకు అనుమతించారు. తిరిగి జూన్ 6వ తేదీన యార్డు తెరవాల్సి ఉన్నా కరోనా కర్ఫ్యూ కారణంగా వాయిదా వేశారు.

యార్డులో పనిచేసే హమాలీలు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లతో చర్చించిన తర్వాత 14వ తేదీన మార్కెట్ తెరవాలని నిర్ణయించారు. దీని కోసం మార్కెట్ యార్డును సిద్ధం చేస్తున్నారు. యార్డులో పేరుకుపోయిన చెత్త చెదారం తొలగిస్తున్నారు. మార్కెట్​ను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు కరోనా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ప్రస్తుతం మిర్చి ధరలు నిలకడగానే ఉన్నాయన్నా ఆయన.. మార్కెట్ యార్డుకు సెస్ రూపంలో ఈ ఏడాది ఇప్పటికే 20కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.

ఇదీ చదవండి:Farmers Letter To CRDA commissioner: 'కౌలు డబ్బులు వెంటనే విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details