పశువుల దాణాలో కల్తీ జరుగుతోందని ఆహార భద్రతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆటోనగర్‌లోని ఓ పశువుల దాణా తయారీ కేంద్రంలో సోదాలు చేశారు. శనక్కాయ పొట్టు, బియ్యం పిండి, పత్తి విత్తనాలను కలిపి పశువులకు దాణా తయారీ చేసే కంపెనీలో చెక్క రంగు వచ్చేందుకు నిషేధిత పసుపు రంగు వాడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో శుక్రవారం దాడి చేశారు. తనిఖీలో నిషేధిత రంగు గుర్తించి రెండు లక్షల విలువైన 200 బస్తాల దాణాను సీజ్ చేసినట్లు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ అధికారి షేక్ మొహిద్దీన్ తెలిపారు. ఈ దాణా తిన్న పశువుల నుంచి వచ్చే పాలు తాగితే మానవాళికి కూడా ముంపు పొంచి ఉందని ఆయన వివరించారు.
పశువుల దాణా కంపెనీపై అధికారుల దాడి..200 బస్తాలు సీజ్ - Officers raid a cattle feeding company -200 bags seized
కాదేదీ కల్తీకి అనర్హంలా మారింది…కొందరి వాలకం. మనుషులు తినే ఆహారమే కాదు పశువులకు పెట్టే దాణాను కూడా ఎంచక్కా కల్తీ చేసేస్తున్నారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందడంతో ఆహార భద్రతాధికారులు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఆటోనగర్ లోని పశువుల దాణా తయారీ కేంద్రంపై దాడి చేసి… 200 బస్తాలు సీజ్ చేశారు.
పశువుల దాణా కంపెనీపై అధికారుల దాడి-200 బస్తాలు సీజ్