ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌరసరఫరాల గోదాంలో అధికారుల తనిఖీలు.. రెండు లారీలు సీజ్ - Two lorries seized at Sattanapalli ration warehouse

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పౌరసరఫరాల గోదాంలో అధికారులు అక్రమాలను గుర్తించారు. రేషన్ డీలర్లకు సరుకులను పంపిణీ చేసే రెండు లారీల్లో తనిఖీలు చేశారు. వస్తువుల బరువుల్లో తేడాలు గమనించి ఆ వాహనాలను సీజ్ చేశారు.

Officers inspect
రెండు లారీలు సీజ్

By

Published : Dec 2, 2020, 4:58 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి పౌరసరఫరాల గోదాంలో సరుకులు తరలించే రెండు లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. రేషన్ దుకాణాలకు వస్తువులను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వాహనాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. సరుకుల బరువుల్లో తేడాలను గుర్తించి లారీలను సీజ్ చేశారు. గోదాంలో ఉన్న సరుకుల నిల్వలు, బరువుల వ్యత్యాసాలను తేల్చేపనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details