నివర్ తుపాను కారణంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, వట్టి చెరుకూరు మండలాల్లో వరి పైరు పూర్తిగా దెబ్బతింది. పులిచింతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ రాజ్, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ శివరామకృష్ణ పొలాలను పరిశీలించారు.
నీటిలో నానుతున్న వరి పైరును అన్నదాతలు అధికారులకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు పెట్టుబడితో సాగు చేస్తే తుపాను ధాటికి పూర్తిగా నష్టపోయామని బాధపడ్డారు. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే నీరు పొలాల్లో నిలిచిపోతుందని చెప్పారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.