గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో వైద్యసేవలు విస్తరించారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్ కేర్ కేంద్రాలను పెంచారు. అందుకు తగ్గట్లుగా సిబ్బంది అవసరం ఏర్పడింది. దీని కోసం అత్యవసరంగా 700మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని అధికారులు నిర్ణయించారు. ఆ మేరకు జిల్లాలోని ప్రైవేటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో చివరి సంవత్సరం విద్యార్థులను తీసుకోవాలని భావించారు. వారందరికీ చదువు పూర్తయినా పరీక్షలు ఇంకా కాలేదు. అయితే ఇపుడు అత్యవసరం కాబట్టి వారి సేవలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అలా చెప్పటంతో..
ఆదివారం నాడు అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లతో అధికారులు సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు నియామక పత్రాలు అందజేస్తామని... కాలేజీలకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, లేదా కొవిడ్ కేర్ కేంద్రాల వద్దకు విద్యార్థులను పంపాలని సూచించారు. అయితే ప్రస్తుతం కాలేజీలు లేని కారణంగా వారందరికీ ఫోన్లలో సమాచారమిచ్చారు. అయితే ఆసుపత్రులు అని కాకుండా డీఎంహెచ్వో కార్యాలయానికి రావాలని వారు చెప్పారు.