ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో నర్సులను తెదేపా నేతల కోవెలమూడి రవీంద్ర సన్మానించారు. ప్రస్తుతం కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించటంలో ప్రాణాలను సైతం లెక్కచేయక విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. వారికి మనోధైర్యాన్ని కల్గించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటుచేశామని ఆయన తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నర్సులు, పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సేవలు వెలకట్టలేనివనన్నారు.
'కరోనా నియంత్రణలో నర్సుల పాత్ర ఎనలేనిది' - గుంటూరులో లాక్డౌన్
కరోనా నియంత్రణలో నర్సుల పాత్ర ఎనలేనిదని తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర కొనియాడారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో నర్సులను సత్కరించారు.
గుంటూరులో నర్సులకు సత్కారం