ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీమలమర్రిలో మరణ మృదంగం..!

గుంటూరు జిల్లా చీమలమర్రిలో పెద్దసంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మరణించగా... నెలన్నర వ్యవధిలో 20 మందికి పైగా చనిపోయారు. కారణాలు తెలియక ప్రజలు కంగారు పడుతున్నారు. మరో 10 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి ఇంత మంది చనిపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్వోప్లాంటు నీరును తాగడానికే ప్రజలు భయపడగా... అధికారులు నీటి నమూనాలు సేకరించి..మరణాలకు గల కారణాలను వెతుకుతున్నారు.

number of deaths at chemalamarri
చీమలమర్రి ఆర్వో ప్లాంట్‌లో నీటి నమూనాలు సేకరిస్తున్న అధికారులు

By

Published : Oct 30, 2020, 6:23 PM IST

గుంటూరు జిల్లా చీమలమర్రిలో వరస మరణాలతో స్థానికులు కలవరపడుతున్నారు. గ్రామంలోని ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. అది కేవలం 24 గంటల వ్యవధిలోనే చనిపోవడంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఇద్దరు అవివాహితులు కాగా మరొకరు 60 ఏళ్ల పైబడిన వ్యక్తి ఉన్నారు. మరో పది మంది వరకు నరసరావుపేటలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జ్వరంతో పాటు డెంగీ లక్షణాలు, ఊపిరితిత్తుల సమస్యతో వీరు బాధపడుతున్నారు. నెలన్నర వ్యవధిలో దాదాపు 20 మందికి పైగా చనిపోయారు.

గ్రామంలో రెండు రోజులుగా ఆర్వో ప్లాంటు నీటిని తాగేందుకు గ్రామస్థులు వణికిపోతున్నారు. ఈ తరుణంలో ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని రెండు ఆర్వో ప్లాంట్ల నుంచి నీటి నమూనాలను సేకరించారు. రెండు రోజుల్లో పరీక్షా ఫలితాలు వెల్లడవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మురళి పేర్కొన్నారు. వరుస మరణాలకు కారణాలపై ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి మందలపు శైలేంద్రకుమార్‌ పేర్కొన్నారు. వారి వెంట సచివాలయ సహాయ ఇంజినీర్‌ శివగోపి, సిబ్బంది ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details