#FarmerSufferinginAP Trending Trending: "పార్మర్స్ సఫరింగ్ ఇన్ ఏపీ" హ్యాష్ టాగ్ దేశవ్యాప్తంగా ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలోని రైతుల కష్టాలను చాటుతూ.. ప్రభుత్వం విధానాలను ఎండగడతూ పలు ట్వీట్లు పెడుతున్నారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల బాధలను పట్టించుకోని సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలి అంటూ.. నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. రైతన్నల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
15జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరికి జగన్ ఎందుకు వెళ్లేలేదు:రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని.. ఆ ఉప్పెనలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు బాధల్లో ఉన్నారని.. Farmers Suffering in AP అని టీడీపీ చేసిన యాష్ టాగ్ ట్విటర్‌లో ట్రెండవుతోంది. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని.. దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ అంటూ ప్రశ్నించారు. ఇప్పటి వరకు దెబ్బతిన్న పంట ఎంత.. ప్రభుత్వం కొన్న ధాన్యం వివరాలను బహిర్గతం చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోవడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్.. ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడని చురకలు అంటించారు. పదిహేను జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఈ ముఖ్యమంత్రి ఒక్క రైతు దగ్గరకు కూడా ఎందుకు వెళ్లలేదని చంద్రబాబు నిలదీశారు. తమ రైతన్నల పంట మునిగింది.. ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కనిపించని వ్యవసాయ శాఖ మంత్రి: రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కనిపించట్లేదంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పంట నష్టం జరిగితే ఒక్క జిల్లాలో కూడా వైసీపీ నాయకులు.. పొలాల్లో దిగి రైతులతో మాట్లాడిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. అకాల వర్షాలకు లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన సర్కారు.. వారి జీవితాలతో ఆడుకుంటుందని లోకేశ్ మండిపడ్డారు. ఇదేం న్యాయం అని ప్రశ్నించిన రైతుల పైన.. ఈ రౌడీ పాలకులు తిరిగి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: