ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NTR Centenary Celebrations: మహానేతను స్మరించుకుంటూ.. వాడవాడలా ఘనంగా ఎన్టీఆర్ జయంత్యుత్సవాలు - ఎన్టీఆర్‌కి ఘనంగా నివాళులు

NTR Centenary Celebrations: నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను తెలుగుదేశం నేతలు, అభిమానులు వాడవాడలా వైభవంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి, సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.

NTR Centenary Celebrations
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

By

Published : May 28, 2023, 5:10 PM IST

Updated : May 28, 2023, 7:56 PM IST

NTR Centenary Celebrations: తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన గొప్ప నేత నందమూరి తారక రామారావు అని నేతలు కొనియాడారు.ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలవేళ.. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జయంతి వేడుకల్నినిర్వహించారు. ఎన్టీఆర్‌ సేవల్ని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో: నందమూరి తారకరామారావు స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహానికి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:NTR Schemes: 'అన్నా' అనే పదానికి సార్థక నామధేయుడు.. ఆ జోడెడ్ల బండికి బ్రాండ్​ అంబాసిడర్​

శత జయంతి వేడుకల్లో భారీగా టీడీపీ శ్రేణులు: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం.. కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, నందమూరి నటసింహం బాలకృష్ణ సహా పలువురు సీనియర్ నేతలు.. నివాళులు అర్పించారు.విశాఖ బీచ్ రోడ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ 16వ వార్డులో తెలుగుదేశం నేత ఎమ్ వాసు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో నేతలు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శత జయంతి వేడుకల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో తెదేపా ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. దేశంలో ఏ సీఎం అమలు చేయలేదని నేతలు పేర్కొన్నారు.

కేక్ కట్ చేసి సంబరాలు: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గడియారం సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు నివాళులర్పించారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

పీవీ రామకృష్ణ దంపతులకు సన్మానం:గుంటూరులోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, టీడీపీ అధికార ప్రతినిధి దాసరి రాజా మాస్టారు.. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ జీవిత కథను రాసిన పీవీ రామకృష్ణ దంపతులను సన్మానించారు.

విశాఖ బీచ్ రోడ్‌లో వేడుకలు: ఎన్టీఆర్ శతజయంతి వేళ విశాఖ బీచ్ రోడ్‌లోని ఆయన విగ్రహానికి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అందించిన విశిష్ట సేవలకుగానూ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ డాక్టరేట్‌ను బహూకరించిందని ఏయూ విశ్రాంత రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావు తెలిపారు. పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. టీడీపీ కార్యాలయంలోనూ ఎన్టీఆర్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.

పూలమాలలు వేసి ఘననివాళులు:ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోటీడీపీశ్రేణులు ఘనంగా నిర్వహించాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లోటీడీపీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.

హిందూపురంలో ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు : అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఎన్టీఆర్ విగ్రహం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. అన్నా క్యాంటీన్, అన్నా ఆరోగ్య రథంలో పని చేసే సిబ్బందిని శాలువాతో సత్కరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ: నంద్యాల జిల్లా పాణ్యంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పంచుకున్నారు. తెలుగు ప్రజలకు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు.. ఎన్టీఆర్​తో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 28, 2023, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details