గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ వర్థంతిని.. తెదెపా యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా పెద్దఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవూరివారిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని, రక్తదానం చేసిన యువతకు ధ్రువపత్రాలను అందజేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు నందమూరి తారకరామారావు అనీ.. ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోతారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.
గుంటూరులోని తెదేపా కార్యాలయంలో..
గుంటూరులోని తెదేపా కార్యాలయంలో నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని నిర్వహించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అని గుంటూరు పార్లమెంటరీ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్ అన్నారు. ఎన్టీఆర్ చిత్ర పటానికి, విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఉజ్వలమైన సీని జీవితాన్ని వదులుకుని ప్రజలకు సేవచేశారని కొనియాడారు. వైకాపా పరిపాలనలో అవినీతి రాజకీయం జరుగుతోందని, రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టే విధానాలను కొనసాగిస్తోందని విమర్శించారు.
నరసరావుపేట తెదేపా కార్యాలయంలో..