ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

NRIs Protests all Over World Against Chandrababu Arrest: అభివృద్ధి ప్రదాతకు అండగా ప్రవాసాంధ్రులు.. ఓటుతో జగన్​కు బుద్ధి చెప్పాలని పిలుపు

NRIs Protests all Over World Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ప్రవాసులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అభివృద్ధి ప్రదాతను అక్రమంగా జైల్లో పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పిలుపునిస్తున్నారు.

NRIs Protests all Over the World Against the Arrest of Chandrababu
NRIs Protests all Over the World Against the Arrest of Chandrababu

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2023, 10:05 PM IST

NRIs Protests all Over World Against Chandrababu Arrest: అభివృద్ధి ప్రదాతకు అండగా ప్రవాసాంధ్రులు.. ఓటుతో జగన్​కు బుద్ధి చెప్పాలని పిలుపు

NRIs Protests all Over World Against Chandrababu Arrest: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్ట్​ చేయడంపై ఇప్పటికే... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ కారిడార్లు నిరసన కార్యక్రమాలతో మారుమోగుతున్నాయి. బాబుతో మేము అంటూ నినాదాలతో చంద్రబాబు అరెస్ట్​కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు, సింగపూర్‌, కువైట్‌, దుబాయి లాంటి పలు దేశాల్లో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్​ను ప్రవాసులంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అభివృద్ధి ప్రదాతను అక్రమంగా జైల్లో పెట్టడం దారుణమని మండిపడుతున్నారు. ఆయనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అరాచక పాలన సాగిస్తున్న జగన్‌కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పిలుపునిస్తున్నారు.

నల్ల జెండాలతో ఆందోళనలు: దార్శనిక నేత చంద్రబాబు అరెస్టును ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో వేలాది మంది ప్రవాసులు కదం తొక్కారు. నల్ల జెండాలు, ప్లకార్డులు చేతబట్టి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కేవలం ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారని ప్రవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​కు రాజకీయంగా వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: బెంగళూరులో కదం తొక్కిన ఐటీ ఉద్యోగులు.. రెండోరోజూ ఆగని నిరసనలు

అమెరికా అధ్యక్ష భవనం ముందు ఆందోళనలు చంద్రబాబుకు సంఘీభావంగాఅమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఎదుట... తెలుగువారు ఆందోళనచేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ నినాదాలు చేశారు. 'బాబుతో నేను' అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇతర నగరాల్లోనూ ఆందోళనలు జరిగాయి. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలో తెలుగు ప్రజలు కార్ల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లండన్​ పార్లమెంట్​ ఎదురుగా.. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా లండన్‌లోని ప్రవాసాంధ్రులు కదం తొక్కారు. లండన్‌ పార్లమెంటు ఎదురుగా.. భారీ ఎత్తున నిరసన తెలిపారు. జగన్‌ వ్యక్తిగత కక్షలతోనే చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయించారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం 40 ఏళ్లు కష్టపడిన చంద్రబాబును.. ఆధారాల్లేని కేసుల్లో ఇరికించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని మండిపడ్డారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా లండన్‌లోని ప్రవాసాంధ్రులు కదం తొక్కారు

సింగపూర్‌లో ఆందోళన కార్యక్రమాలు: రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన చంద్రబాబును అరెస్టు చేయడంపై... సింగపూర్‌లో స్థిరపడిన తెలుగువారు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన దార్శనికుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సృష్టించిన వ్యవస్థల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి మచ్చలేని చంద్రుడిలా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Prathidwani : ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. చంద్రబాబు అరెస్ట్​తో మిన్నంటిన నిరసనలు

కువైట్‌లో నిరసన కార్యక్రమాలు చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ కువైట్‌లో తెలుగు ప్రజలు నిరసనకు దిగారు. "బాబుతో నేను" అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు దారుణమంటూ... సౌదీ అరేబియాలోని ఆల్ కోభార్‌లో “ఎన్ఆర్ఐ (NRI) తెలుగుదేశం" నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఏపీ బాగుపడాలంటే "సైకో పోవాలి - సైకిల్ రావాలి" అని నినాదాలు చేశారు. దక్షిణాఫ్రికాలోని మాడ్రిన్డ్‌లో నిరసన దీక్షలు చేసిన ప్రవాసులు... చంద్రబాబు విడుదల కావాలని నినాదాలు చేశారు.

NRI Protests in America Over Chandrababu Arrest: అమెరికాలో గళమెత్తిన తెలుగు ప్రజలు.. టీడీపీ-జనసేన జెండాలతో భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details