గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు.. అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు మాస్కులు, శానిటైజర్, పీపీఈ కిట్లు, చేతి తొడుగులు ఉచితంగా పంపిణీ చేసినట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సౌభాగ్య వాణి తెలిపారు. వీటిని ఉరకరణం.వెంకట్, గురివిందపల్లి.డేవిడ్, వేమూరి. కిరణ్, మల్లపురాజు. సుమోధన్, మల్లపురాజు.రాఘవ వర్మ.. అందించినట్టు ఆర్ఎంఓలు డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ సుధీర్ వివరించారు.
రెండు లక్షల కొవిడ్ కిట్లను పంపిణీ చేసిన ప్రవాస భారతీయులు
అమెరికా టెక్సాస్ లోని ప్రవాస భారతీయులు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లకు రెండు లక్షల విలువైన కరోనా నివారణ పరికరాలను ఉచితంగా అందించారు. వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సౌభాగ్యవాణి అభినందించారు.
ప్రవాస భారతీయులు
TAGGED:
గుంటూరు జిల్లా తాజా వార్తలు