Scams by cyber criminals in Hyderabad: దేశానికి చెందిన పలువురు ఎన్‌ఆర్ఐ మహిళలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు భారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ఓ ఎన్‌ఆర్ఐ మహిళ గతంలో యూకేలో డాక్టర్‌గా పని చేస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌లో తాను ఇటలీకి చెందిన అహ్మద్ అని సైబర్ నేరగాడు పరిచయం చేసుకున్నాడు. తానొక న్యూరో సర్జన్ అని చెప్పడంతో అతనితో బాధితురాలు చాటింగ్ చేసింది. తాను పలు దేశాలకు వెళ్లి వైద్యం చేస్తుంటానని నిందితుడు చెప్పాడు. ప్రయాణ ఖర్చుల కోసం అని.. కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నానని, డబ్బు తిరిగి ఇస్తానని చెప్పడంతో బాధితురాలు అతను తెలిపిన ఖాతాల్లో పలు దఫాలుగా రూ.84లక్షలు జమ చేసింది. డబ్బులు అడగడంతో తన అసలు రంగు బయటపడి మోసపోయానని గ్రహించింది.
వైద్యం పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త అవతారం.. ఆ మహిళలే టార్గెట్
Scams by cyber criminals in Hyderabad: రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్త అవతారాలు ఎత్తి బాధితులను నిలువు దోపిడి చేస్తున్నారు. ఇందులో బాధితులు అందరూ.. బాగా చదువుకున్నవారు.. డాక్టర్లు.. విదేశాల్లో స్థిరపడినవారేే.. ఇలాంటి వారినే టార్గెట్‌చేసి వలవేసి మరి కేటుగాళ్లు డబ్బులు లాక్కుంటున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ ఉదాహరణనే ఇందుకు తార్కాణం.
సైబర్ నేరగాళ్లు
తనలాగే చాలా మంది మోసపోయారని తెలుసుకొని వారి వివరాలు సేకరించి.. నిందితుడిపై బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలువురి నుంచి 2.58కోట్ల రూపాయల వసూలు చేసినట్లు పోలీసులకు తెలిపింది. నగదు చెల్లించిన బ్యాంకు ఖాతాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవీ చదవండి: