ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక నిమిత్తం... ఈ నెల 18న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి జులై 6న పోలింగ్ నిర్వహించనున్నారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ప్రస్తుతం ఎన్నిక జరగనుంది. మార్చి 9న ఎమ్మెల్సీగా డొక్కా రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక: ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల - ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
మండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి జూలై 6న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నిక నిమిత్తం.. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఖాళీ ఎమ్మెల్సీ స్థానానికి విడుదల కానున్న నోటిఫికేషన్