ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ - సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

665 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ చేయటానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు ఎంబీబీఎస్ అర్హత అని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు.

notification for assistant civil surgeon
సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

By

Published : Jun 17, 2020, 11:00 AM IST

ప్రజారోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 665 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. ఎంబీబీఎస్‌ అర్హతతో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రజారోగ్య శాఖ సంచాలకురాలు డాక్టర్‌ అరుణ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 19 నుంచి మొదలై వచ్చేనెల 18వ తేదీ వరకు జరుగుతుంది. వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు వివరించారు.

వైద్య ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి పెంపు

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాల భర్తీలో జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు వయో పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచారు. ఈ మేరకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

ప్రజారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 1,021 ఉద్యోగాలను పొరుగుసేవల కింద భర్తీ చేస్తారు. బోధనాసుపత్రుల్లో 442 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయిందని వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

ఇదీ చదవండి:బడ్జెట్​ కేటాయింపుల్లో వైద్యానికి 0.18 శాతం పెరుగుదల

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details