ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బిల్లు కట్టని పంచాయితీలకు.. కరెంట్ కట్..! - notice to panchayats who didn't pay current bills

గుంటూరు జిల్లాలో పెదకాకానితో పాటు.. గుంటూరు గ్రామీణ మండలాల పరిధిలో విద్యుత్​ బిల్లులు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది. వీధి దీపాలు, తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలను పంచాయతీలు చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు.

panchayat electric bills at guntur district
panchayat electric bills at guntur district

By

Published : Dec 13, 2020, 8:34 AM IST

గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. పెదకాకాని, గుంటూరు గ్రామీణ మండలాల పరిధిలో బిల్లులు కట్టని పంచాయతీలకు ఈ మేరకు విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. పెదకాకాని మండలంలో రూ.7.82 కోట్లు, గుంటూరు గ్రామీణ మండల పరిధిలో రూ. 2.30 కోట్ల బకాయిలున్నాయి.

వీధి దీపాలు, తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలను పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. సంబంధిత వర్గాలకు నోటీసుల ద్వారా ఈ విషయం తెలియపర్చామని.. పెండింగు బిల్లులో కనీసం 40 శాతం కూడా చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు విద్యుత్ శాఖ ఈఈ జె.హరిబాబు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details