ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొందరితో ఆటాడుకున్న నోటా - Nota played with some newsupdates

గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజారిన అభ్యర్థులు ఇప్పుడు 'నోటా' ఎంత పనిచేసిందంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. ఎందుకంటే వారికి విజయం చిక్కినట్లే చిక్కి అతి తక్కువ దూరంలోనే నిలిచిపోయింది.

Nota played with some
కొందరితో ఆటాడుకున్న నోటా
author img

By

Published : Feb 14, 2021, 1:36 PM IST

గుంటూరు జిల్లా రెవెన్యూ డివిజన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల సమరంలో త్రుటిలో విజయం చేజారిన అభ్యర్థులు ఇప్పుడు ‘నోటా’ ఎంత పనిచేసిందంటూ నిట్టూర్పు విడుస్తున్నారు. ఎందుకంటే వారికి విజయలక్ష్మి చిక్కినట్టే చిక్కి అతి తక్కువ ఓట్ల దూరంలోనే నిలిచిపోయింది. వీరికి రావాల్సిన ఓట్ల కంటే ఆయా స్థానాల్లో ‘నోటా’కు పడినవే ఎక్కువగా ఉండడం ఈ అభ్యర్థులను వేదనకు గురిచేస్తోంది. దేశంలో తొలిసారిగా 2013లో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ గుర్తు వచ్చి చేరింది. బరిలో ఉన్న అభ్యర్థులెవరూ ఓటరుకు నచ్చకపోతే తన అయిష్టతను ఈ రూపంలో వెల్లడించే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ‘నోటా’ గుర్తు దేశమంతా అమలైంది. 2019 ఎన్నికల నాటికి ఈ గుర్తుకు ఓటు వేసే వారి సంఖ్య మరింత పెరిగింది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో తొలిసారిగా బ్యాలెట్‌ పేపర్‌లోనూ ఈ గుర్తు చోటు దక్కించుకుంది. జిల్లాలో తొలి విడతగా ఈ నెల 9న తెనాలి డివిజన్‌ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల నోటాకు పడిన ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేశాయి. ఈ గుర్తుపై పడిన కొన్ని ఓట్లు అటూ ఇటు అయి ఉంటే విజయాలు మారిపోయేవి.

* కొల్లిపర మండలం పిడపర్తిపాలెంలో విజేత ఒక్క ఓటు ఆధిక్యతతో గెలుపొందగా, ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు నాలుగు ఉండడం గమనార్హం.

* పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరులో విజేత మెజారిటీ 11 ఓట్లు కాగా.. ఇక్కడ నోటాకు పడినవి 21.

* వేమూరు మండలం పోతుమర్రులో గెలిచిన అభ్యర్థి మెజారిటీ 1. ఇక్కడ నోటాకు 7 ఓట్లు పడ్డాయి.

* చేబ్రోలు మండలం తోట్లపాలెం సర్పంచ్‌ విజేత మెజారిటీ 6 కాగా, నోటా గుర్తుపై పడిన ఓట్లు 7.

* బాపట్ల పరిధిలోని వెదుళ్లపల్లి సర్పంచ్‌ అభ్యర్థి మెజారిటీ 30. అయితే ఇక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 49.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాద ఘటనపై గవర్నర్, సీఎం దిగ్భ్రాంతి

ABOUT THE AUTHOR

...view details