రాజధాని అమరావతి కోసం తాము చేస్తున్న పోరాటంలో పాల్గొనాలని రాజకీయేతర ఐకాస నేతలు భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు విజ్ఞప్తి చేశారు. గుంటూరులోని ఆయన నివాసంలో కన్నాను కలిసిన ఐకాస ప్రతినిధులు... రాజధాని తరలిపోకుండా చూడాలని అభ్యర్థించారు. దీనిపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడిన ఐకాస నేతలు రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండేలా గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే ఇపుడు మార్చటం సరికాదన్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయొద్దని కోరారు.
'అమరావతి పోరాటంలో మాకు సహకరించండి' - అమరావతి వార్తలు
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణను రాజకీయేతర ఐకాస నేతలు కలిశారు. అమరావతి కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. తమతోపాటు ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనాలని అభ్యర్థించారు.
కన్నా లక్ష్మీనారాయణను కలిసిన రాజకీయేతర ఐకాస నేతలు