రేపల్లెలో జోరందుకున్న నామినేషన్ ప్రక్రియ - గుంటూరులో రెండో రోజు నామినేషన్ ప్రక్రియ వార్తలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ రెండో రోజు ముగిసింది.
![రేపల్లెలో జోరందుకున్న నామినేషన్ ప్రక్రియ Nomination process ended on the second day in Guntur district Repalle constituency](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10442034-380-10442034-1612026004555.jpg)
తొలిదశ పంచాయతీ ఎన్నికలకు గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల కోసం నిజాంపట్నం మండలంలో 4, చెరుకుపల్లి 6, రేపల్లె 10, నగరంలో 11 క్లస్టర్లను అధికారులు ఏర్పాటు చేశారు. తొలి రోజు తక్కువ నామినేషన్లు దాఖలు అవ్వగా.. రెండవ రోజు జోరందుకున్నాయి. చెరుకుపల్లి మండలంలో 32 సర్పంచ్, 123 వార్డ్ సభ్యులు, రేపల్లెలో 46 సర్పంచ్, 147 వార్డ్ సభ్యులు, నగరంలో 63 సభ్యులు, 194 వార్డ్ సభ్యులు, నిజాంపట్నం మండలంలో 16 సర్పంచ్, 51 వార్డ్ సభ్యులు నామినేషన్లు సమర్పించారు.