గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఖాతాదారులు... భౌతిక దూరం పాటించకుండా క్యూలైన్లో నిలబడ్డారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధదారులు, ఖాతాదారులతో బ్యాంకు ఆవరణ మెుత్తం కిక్కిరిసిపోయింది. సత్తెనపల్లిలో ఇప్పటికే 650 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనా.. ప్రజల్లో మాత్రం భయం కానరావటం లేదు. భౌతిక దూరం పాటించకుంటే కొవిడ్ మరింత విస్తరించే అవకాశం ఉంది.
సత్తెనపల్లిలో కానరాని భౌతిక దూరం - సత్తెనపల్లిలో భౌతిక దూరం పాటించని ప్రజలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తున్నా... ప్రజల్లో మార్పు రావటం లేదు. బ్యాంకు ఖాతాదారులు, వివిధ పథక లబ్ధిదారులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద భౌతిక దూరం పాటించకుండా.. తోసుకుంటూ నిలబడ్డారు.
సత్తెనపల్లిలో కానరాని భౌతిక దూరం