ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ వారియర్లకు వేతనాలు కరవు - కొవిడ్ పరీక్ష చేస్ ఉద్యోగుల కష్టాలు

తమ ప్రాణాలకు తెగించి కొవిడ్ పరీక్షలు నిర్వహించిన తమకు వేతనాలు చెల్లించడం లేదని ఒప్పంద ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరా ఐమాస్క్ సంస్థ మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని గుంటూరు జేసీ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. సంస్థపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

no salary for covid worriors at guntur district
no salary for covid worriors at guntur district

By

Published : Nov 16, 2020, 7:24 PM IST

కొవిడ్ పరీక్షలు చేయడానికి ఒప్పంద పద్ధతిలో ఉద్యోగంలో పెట్టుకున్న తమకు గత మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా వీరా ఐమాస్క్ సంస్థ ఇబ్బందులకు గురిచేస్తుందని ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు న్యాయం చేయాలని కోరుతూ గుంటూరు జాయింట్ కలెక్టర్ ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. వీరా ఐమాస్క్ సంస్థకు చెల్లించాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించడం జరిగిందని జేసీ అన్నారు. సంస్థ వారిని పిలిపించి మాట్లాడతామని జేసీ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details